Hyderabad, మార్చి 21 -- Saaree Director About Aaradhya Devi In Trailer Launch: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఆకట్టుకుంది ఆరాధ్య దేవి. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్ చేసే ఆరాధ్య దేవిని చీరలో చూసిన రామ్ గోపాల్ వర్మ శారీ మూవీకి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దాంతో తెలుగులో ఆరాధ్య దేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూల కథ అందించిన శారీ సినిమాలో ఆరాధ్య దేవితోపాటు సత్య యాదు ప్రధాన పాత్రలో నటించాడు. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన శారీ మూవీకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించిన శారీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్...