భారతదేశం, ఏప్రిల్ 22 -- బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' చిత్రం విడుదల కావాల్సి ఉంది. జూన్ 20న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనన కలల ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చేస్తున్న ప్లాన్స్ గురించి అప్‍డేట్స్ ఇచ్చారు.

మహాభారతాన్ని వెండితెరపై చూపించాలని తాను చాలా కాలంగా లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమిర్ ఖాన్ అన్నారు. ఈ సినిమా రైటింగ్ పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయని హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్‍డేట్ చెప్పారు.

మహాభారతం సినిమా ఫ్రాంచైజీలో కొన్ని భాగాలు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్టు ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ పార్ట్‌లకు వేర్వేరు డైరెక్టర్లు షూటింగ్ చేసేలా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏకకాలంలో కొన్ని పార్ట్‌ల షూ...