Hyderabad, మార్చి 13 -- Aamir Khan Girlfriend: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన 60వ బర్త్ డేకు ఒక రోజు ముందు గట్టి షాకే ఇచ్చాడు. ఆ మధ్య తన రెండో భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇచ్చేసిన అతడు.. ఒంటరిగా ఉన్నాడనుకుంటే.. సడెన్ గా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను పరిచయం చేశాడు. గురువారం (మార్చి 13) ముంబైలోని హోటల్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తన కెరీర్, జీవితం గురించి మాట్లాడుతూ గౌరి గురించి చెప్పాడు.

ఆమిర్ ఖాన్, గౌరి ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడటం విశేషం. నిజానికి ఈ ఇద్దరూ 25 ఏళ్ల కిందటే తొలిసారి కలుసుకున్నారట. అయితే మధ్యలో టచ్ లో లేకుండా పోయి.. రెండేళ్ల కిందట మళ్లీ కలుకున్నట్లు ఆమిర్ చెప్పాడు. అయితే తమ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మాత్రం 18 నెలల కిందట మొదలైనట్లు ఆమిర్ వెల్లడించాడు.

మీకు ఇన్నాళ్లుగా తెలియకుండా దాచాను చూశారా అంటూ మీడియా వాళ్లతో ఆమిర్ సరద...