భారతదేశం, ఫిబ్రవరి 15 -- Aamir Khan Biggest Flop Movie: ఆమిర్ ఖాన్, రజనీకాంత్.. 1990ల్లో ఇండియన్ సినిమాలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోలు. ఈ ఇద్దరూ కలిసి తీసిన ఓ మూవీ ఆమిర్ ఖాన్ కెరీర్లోనే అతి పెద్ద ఫ్లాప్ మూవీగా మిగిలిపోయిందంటే నమ్మగలరా? అంతేకాదు ఈ సినిమా రజనీకాంత్ బాలీవుడ్ కెరీర్ ను, మూవీ తీసిన డైరెక్టర్ దిలీప్ శంకర్ కెరీర్ నూ ముగించింది. ఆ సినిమా పేరు ఆతంక్ హీ ఆతంక్.

ఆమిర్ ఖాన్ అంటే చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తాడని పేరుంది. అతని కెరీర్లో ఫ్లాపుల సంఖ్య చాలా తక్కువ. అయితే 1995లో అతడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. హాలీవుడ్ లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ స్ఫూర్తిగా ఆ ఏడాది ఆతంక్ హీ ఆతంక్ అనే మూవీ చేశాడు. అందులో రజనీకాంత్, జూహీ చావ్లా కూడా నటించారు. ఈ మూవీకి దిలీప్ శంకర్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింద...