భారతదేశం, ఫిబ్రవరి 1 -- బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలోకి మరో మహిళ వచ్చారంటూ తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమిర్ ప్రస్తుతం సీక్రెట్ రిలేషన్‍లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మూడో పెళ్లి చేసుకోనున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమిర్ ఖాన్ సీరియస్ రిలేషన్‍లో ఉన్నారని ఫిల్మ్‌ఫేర్ రిపోర్ట్ పేర్కొంది. కానీ ఆమె ఎవరో మాత్రం రివీల్ చేయలేమనమంది. "ఆమిర్ మిస్టరీ పార్ట్‌నర్‌ది బెంగళూరు. వారి ప్రైవసీని మేం గౌరవించాలి. అందుకే వివరాలు వెల్లడించడం లేదు. అయితే, ఆమెను ఆమిర్ తన కుటుంబం మొత్తానికి పరిచయం చేశారు. ఈ మీటింగ్ బాగా జరిగింది" అని సంబంధిత వ్యక్తులు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఆ మహిళను తన కుటుంబ...