Hyderabad, ఫిబ్రవరి 18 -- Aakash Chopra on Chhaava: బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు మొత్తం దేశంలో సంచలనం రేపుతున్న మూవీ ఛావా (Chhaava). విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ధీరత్వానికి చెందిన ఓ అత్యద్భుతమైన కథ ఇది అని అతడు అన్నాడు.

ఛావా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సినిమాను ప్రశంసించాడు. సోమవారం (ఫిబ్రవరి 17) మూవీని చూసిన అతడు.. తన ఎక్స్ అకౌంట్లో రివ్యూ పోస్ట్ చేశాడు.

"ఛావా మూవీ ఈరోజు ...