భారతదేశం, మార్చి 11 -- Aadudam Andhra : వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించింది. అయితే ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయలు దోచుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిన్న అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్రపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం 45 రోజుల్లో రూ.119 కోట్లు ఖర్చు చేశారన్నారు. రూ.119 కోట్లే కాదని, అంతకు మించి పెద్ద కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని, కేవలం రూ.119 కోట్లకు సంబంధించి 'ఆడుదాం ఆంధ్ర' ఖర్చు మాత్రమే కాదు జిల్లా ఫండ్స్‌ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో...