Hyderabad, మార్చి 13 -- Aadi Saikumar On Avika Gor And Shanmukha Movie: కొత్త తరహా కథలతో రూపొందే డివోషనల్‌ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్‌ డివోషనల్‌ కథతో రూపొందిన చిత్రం 'షణ్ముఖ'. ఈ మూవీ కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది.

డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా 'షణ్ముఖ' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది సాయికుమార్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. షణ్ముఖ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కత్వం వహించారు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ త‌మ ద్వితీయ చిత్రంగా షణ్ముఖను నిర్మించింది.

సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, రమేష్‌ యాదవ్ షణ్ముఖ చిత్రాన్ని నిర్మించారు. చిత...