భారతదేశం, నవంబర్ 1 -- భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్‌డేట్‌లను మరింత వేగంగా, సులభంగా, పూర్తిగా డిజిటల్‌గా మార్చేందుకు పలు ముఖ్యమైన మార్పులు చేసింది. నవంబర్ 1, 2025 నుంచి ప్రజలు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు! దీని వల్ల ఇకపై ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం, పొడవైన క్యూలలో నిలబడాల్సిన ఇబ్బంది తప్పుతుంది!

యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయం ఆధార్ సేవలను మరింత సురక్షితంగా, వినియోగదారునికి అనుకూలంగా, సమర్థవంతంగా మార్చడానికి తీసుకున్నారు.

ఇంతకుముందు, ఆధార్‌లోని సవరణలు లేదా అప్‌డేట్‌ల కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రం వద్దకు వెళ్లాల్సి వచ్చేది.

కొత్త విధానం ద్వారా, పౌరులు తమ ఇంటి నుంచే, కొన్ని క్లిక్‌లలో ...