భారతదేశం, ఫిబ్రవరి 1 -- Aadhaar misuse: బ్యాంకింగ్, ట్రావెల్, ప్రభుత్వ ప్రయోజనాలతో సహా వివిధ సేవలకు ఆధార్ విస్తృతంగా ఉపయోగించే గుర్తింపు పత్రంగా మారింది. గుర్తింపును ధృవీకరించడానికి 12 అంకెల ఆధార్ తరచుగా అవసరం పడుతోంది. ఇది రోజువారీ లావాదేవీలలో ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఇతరుల ఆధార్ ను మోసగాళ్లు ఆర్థిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన ఆధార్ ను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారో హిస్టరీ ఒక దగ్గర ఉంటుంది. అది ఎక్కడ అంటే..?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మై ఆధార్ పోర్టల్లో "ఆథెంటికేషన్ హిస్టరీ" అనే ఫీచర్ ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ ను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారో హిస్టరీ ఉంటుంది. ఈ ఆన్లైన్ టూల్ వినియోగదారులకు ఆధార్ సంబంధిత కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, ...