భారతదేశం, ఏప్రిల్ 17 -- Aadhaar and PAN: ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పంచుకున్న నోటిఫికేషన్ ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు ఖాతాను తెరవడానికి ఆధార్ తప్పని సరి. అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసే పౌరులు ఆధార్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా అందించడం ఇప్పుడు తప్పనిసరి.

ఒకవేళ ఎవరికైనా ఆధార్ (Aadhaar) నంబర్ లేకపోతే, వారు ఆధార్ కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కు దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపే పత్రాన్ని ఏదైనా పొదుపు పథకాల్లో కొత్త ఖాతా తెరవడానికి రుజువుగా ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్ వచ్చిన తరువాత ఆధార్ (Aadhaar) నంబర్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది.

ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో ఖాతాదారుడు ఆధార...