భారతదేశం, ఏప్రిల్ 8 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన అప్‍డేట్ వచ్చేసింది. పుష్ప 2 భారీ సక్సస్ తర్వాత ఆయన నెక్స్ట్ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా(AA22 x A6)పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ 43వ పుట్టిన రోజు సందర్భంగా ఈ అదిరే అప్‍డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ స్పెషల్ వీడియో తీసుకొచ్చింది.

అల్లు అర్జున్ - అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఓ స్పెషల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. అమెరికా లాస్ ఏంజిల్స్ సిటీలోని ప్రముఖ లోలా వీఎఫ్‍ఎక్స్ సంస్థ కార్యాలయంలో ఈ వీడియోను మూవీ టీమ్ షూట్ చేసింది. అల్లు అర్జున్, అట్లీ ఈ స్టూడియోలోకి వెళ్లి టెక్నిషియన్లతో మాట్లాడారు. స్టూడియోలోని వాటిని, వీఎఫ్ఎక్స్ పనులను పరిశీలించారు. అల...