భారతదేశం, డిసెంబర్ 20 -- వన్‌ప్లస్ నుంచి సరికొత్త 'టర్బో' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి! పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌కు పెద్దపీట వేస్తూ తయారవుతున్న ఈ ఫోన్‌ల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 2026 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది!

వన్‌ప్లస్ ఇప్పటికే 'టర్బో' పేరుతో ఒక కొత్త సిరీస్‌పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్ ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ గేమింగ్ ఎక్స్​పీరియెన్స్​ని, తిరుగులేని బ్యాటరీ పవర్‌ను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్‌ సిరీస్​కి సంబంధించి ఇప్పటివరకు లీకైన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' అందించిన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో స...