భారతదేశం, జనవరి 19 -- స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి రెడ్‌మీ సిద్ధమైంది. అసాధారణమైన బ్యాటరీ లైఫ్, అగ్రశ్రేణి పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం 'రెడ్‌మీ టర్బో 5 మాక్స్' మోడల్‌ను ఈ నెలలో చైనా మార్కెట్​లో లాంచ్ చేయబోతున్నట్లు ఈ షావోమీ సబ్​-బ్రాండ్​ అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏ షావోమీ ఫోన్‌లోనూ లేని విధంగా ఏకంగా 9000ఎంఏహెచ్​ సామర్థ్యం కలిగిన 'జిన్‌షాజియాంగ్' బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 10,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇచ్చే స్థాయి బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీనికి తోడు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు సమాచారం. బ్యాటరీ అయిపోతుందనే ఆందోళన ఇక ఈ ఫోన్ వాడేవారికి ఉండదు.

ఈ స్మార...