భారతదేశం, డిసెంబర్ 24 -- బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన 19 రోజుల్లోనే రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తోంది.

అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కు వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. దురంధర్ సినిమా ప్రయాణం మొదటి రోజు నుంచే ఎంతో ఆశాజనకంగా మొదలైంది.

తొలి వారంలోనే ఏకంగా రూ. 207.25 కోట్లు కొల్లగొట్టిన 'ధురందర్' రెండో వారంలో ఆ వేగాన్ని మరింత పెంచింది. రెండో వారంలో ఏకంగా రూ. 253.25 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారంలో వసూళ్లు తగ్గుతాయి. కానీ, దురంధర్ మూవీ విషయంలో మాత్రం సీన్ ర...