భారతదేశం, జనవరి 28 -- రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్ ప్రాజెక్టు ఇన్వెస్టర్లకు బాగా నచ్చింది. గత ఏడాది అక్టోబర్లో గురుగ్రామ్‌లో ది దాలియాస్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 9 వారాల్లో 173 అపార్ట్ మెంట్లను రూ.11,816 కోట్లకు విక్రయించారు. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్-5లో 17 ఎకరాల విస్తీర్ణంలో ది దాలియాస్ అనే హౌసింగ్ ప్రాజెక్టును డీఎల్ఎఫ్ గత ఏడాది అక్టోబర్‌లో మెుదలుపెట్టింది.

ఇక్కడ 420 అపార్ట్ మెంట్లు, పెంట్ హౌస్‌లు ఉన్నాయి. డీఎల్ఎఫ్ తన ది దాలియాస్ ప్రాజెక్టులో మిగిలిన 247 యూనిట్ల విక్రయం ద్వారా కనీసం రూ.23,000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఇదే ప్రదేశంలో ది కామెలియాస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత డీఎల్ఎఫ్ అందిస్తున్న రెండో విలాసవంతమైన ఆఫర్ ఇది.

ఈ ప్రాజెక్టులో అపార్ట్మెంట్ కనీస పరిమాణం 10,300 చదరపు అడుగులు. ఇన్వెస్...