Telangana,hyderabad, ఆగస్టు 16 -- భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక వ‌ర్ష‌పాతం, మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని సీఎం తెలిపారు.

నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. ఈ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ఉదయం ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతార‌ని సీఎం రేవంత్ తె...