భారతదేశం, జనవరి 10 -- డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ జన నాయగన్ తోపాటు పలు సినిమాలకు బోర్డు నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అతడు స్పందించాడు. ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసిన వర్మ.. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు అవసరమా అని ప్రశ్నించాడు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు.. అందులో అసలు ఎలాంటి సెన్సార్ లేని కంటెంట్ లిమిట్ లేకుండా వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు సెన్సార్ అవసరమా అన్నది రామ్ గోపాల్ వర్మ వాదనగా కనిపిస్తోంది. అతడు శుక్రవారం (జనవరి 9) రాత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

"ఇది కేవలం దళపతి విజయ్ నటిస్తున్న 'జననాయగన్' సినిమాకు సంబంధించిన సెన్సార్ సమస్య మాత్రమే కాదు. మొత్తం వ్యవస్థకు సంబంధించిన మౌలికమైన ప్రశ్న. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు ...