భారతదేశం, జూలై 12 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల సవరణ కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటును ఆమోదించినప్పటికీ, దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే వేతన సంఘం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతాలు, అలవెన్సులను సవరిస్తుంది. అసలేంటివి? అని తెలుసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఆసక్తితో ఉంటారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జీతాలు, పెన్షన్లు, అలవెన్సులను సవరించడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వేతన సంఘాలు ఉపయోగిస్తాయి. ఈ ముఖ్యమైన మల్టిప్లైయర్.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వం...