భారతదేశం, అక్టోబర్ 13 -- కోటి 20 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, భత్యాలను సవరించడానికి ఉద్దేశించిన 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ఇంకా అధికారికంగా జరగలేదు! కేంద్ర కేబినెట్ జనవరి 2025లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఈ కమిషన్ పని ముందుకు సాగడంలో కీలకమైన రెండు అంశాలపై ఇంకా క్లారిటీ లేదు! అవి.. ఛైర్మన్ నియామకం, నిబంధనలు, షరతుల (టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ -టీఓఆర్​) ఖరారు.

ఈ రెండు లేకపోవడంతో, కమిషన్ తన పనిని ప్రారంభించలేకపోతోంది. దీనివల్ల మొత్తం వేతన సవరణ ప్రక్రియ నిర్ణీత సమయం కంటే బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది!

టీఓఆర్​ అనేవి కమిషన్ పరిధిని, వేతన స్కేల్‌లు, భత్యాల స్ట్రక్చర్​, పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు అన్ని ఇతర అంశాలను నిర్వచించే ముఖ్యమైన పత్రం. గతంలో.. 7వ వేతన సంఘం సెప్టెంబర్ 2013లో ప్రకటించిన తర్వాత, కొద్ది నెలల...