భారతదేశం, డిసెంబర్ 10 -- గురువారం జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రత, శాంతిభద్రతల చర్యలను చేపట్టిందని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో 395 గ్రామాలు, రెండో దశలో 495 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది.

ఇప్పటివరకు అధికారులు తనిఖీల సమయంలో రూ.8.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50,000 మంది సివిల్ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, భద్రతను పటిష్టం చేయడానికి బయటి నుండి 60 ప్లాటూన్లను రప్పించామని ఎస్ఈసీ రాణి కుముదిని తెలిపారు.

మెుదటి దశ గ్రామ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం చేసినట్టుగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. 'తొలి ద...