భారతదేశం, ఏప్రిల్ 21 -- రోమన్ క్యాథలిక్ చర్చి తొలి లాటిన్ అమెరికన్ నేత పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని వాటికన్ సోమవారం ఒక వీడియో ప్రకటనలో తెలిపింది.

"ప్రియమైన సోదరులు, సోదరీమణులారా.. ఫాథర్​ ఫ్రాన్సిస్​ మరణించారన్న విషయాన్ని అత్యంత బాధతో ప్రకటిస్తున్నాను. ఈ రోజు ఉదయం 7:35 గంటలకు (0535 జిఎంటి) రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఫాథర్​ దగ్గరికి వెళ్లిపోయారు. చర్చ్​కి, దేవుడికి ఆయన తన జీవితం మొత్తాన్ని అంకితం చేశారు," అని వాటికన్ తన టెలిగ్రామ్ ఛానెల్​లో ప్రచురించిన ప్రకటనలో కార్డినల్ కెవిన్ ఫారెల్ వెల్లడించారు.

88 ఏళ్ల వయసున్న ఆయన, తన 12 ఏళ్ల పోప్​ బాధ్యతల మధ్యలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.

పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తన ఈస్టర్ సండే ప్రసంగంలో ఆలోచనా స్వేచ్ఛ, సహనానికి పిలుపునిచ్చారు.

బాసిలికా బాల్కనీ నుంచి 35,000 మందికి పైగా మంది జనసమూహ...