భారతదేశం, ఆగస్టు 23 -- వన్‌ప్లస్ ఏస్ 6, అలాగే కొత్త రియల్‌మీ ఫోన్ తయారీలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవి భారత మార్కెట్‌లోకి కూడా రావచ్చని అంచనాలు ఉన్నాయి. అధికారిక వివరాలు ఇంకా తెలియకపోయినా, లీక్‌లు మాత్రం ఈ ఫోన్‌ల గురించి చాలా సమాచారం అందించాయి. చైనాలో వచ్చిన తాజా పుకార్ల ప్రకారం.. వన్‌ప్లస్ ఏస్ 6, అలాగే రియల్‌మీ ఫోన్ (ఇంకా పేరు తెలియదు) రెండింటిలోనూ 8000ఎంఏహెచ్​ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు ఉంటాయని సమాచారం.

స్మార్ట్ పికాచు అనే టిప్‌స్టర్.. వీబో అనే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్‌ల వివరాలను పంచుకున్నారు. అతని ప్రకారం.. వన్‌ప్లస్, రియల్‌మీ రెండూ అధిక సామర్థ్యం గల సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను తయ...