భారతదేశం, ఆగస్టు 3 -- ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ మూవీ వచ్చేస్తోంది. హార్ట్ టచింగ్ గా సాగే ఓ తండ్రీ కొడుకుల జర్నీతో తెరకెక్కిన 'పరంతు పో' (Paranthu Po) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. నటులు శివ, గ్రేస్ ఆంటోని తదితరులు నటించిన ఇటీవల విడుదలైన తమిళ చిత్రం పరంతు పో ఓటీటీలో విడుదల కానుంది. నెల రోజుల పాటు థియేట్రికల్ రన్ అయిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రన్ కు రెడీ అయింది.

తమిళ సూపర్ హిట్ మూవీ పరంతు పో ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆగస్టు 5 నుంచి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. తమిళంతో సహా ఏడు భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో పరంతు పో స్ట్రీమింగ్ కానుంది.

పరంతు పో సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 4న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది...