భారతదేశం, అక్టోబర్ 11 -- భారత సినీ పరిశ్రమలో 8 గంటల పని షిఫ్టులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు పాకిస్థానీ నటి ఇఖ్రా అజీజ్ తన మద్దతు తెలిపింది. 8 గంటల పనిదినం కోరడం వల్లే దీపిక.. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ అనే రెండు పెద్ద ప్రాజెక్టుల నుండి వైదొలిగినట్లు వార్తలు రావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.

ఇటీవల దీపిక తన 8 గంటల పనిదినం అభ్యర్థన చుట్టూ ఉన్న వివాదంపై స్పందించారు.సీఎన్బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పురుష సూపర్‌స్టార్లు చాలా సంవత్సరాలుగా ఇదే 8 గంటల షెడ్యూల్‌ను అనుసరిస్తున్నారని, కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది తన కుమార్తె దువాకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె కు మద్దతుగా పాకిస్థాన్ నటి ఇఖ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ముందుకొచ్చింది.

దీపిక ఇంటర్వ్యూ క్లిప్‌ను...