భారతదేశం, డిసెంబర్ 29 -- లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి (8th Pay Commission) సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఇటీవలే ఈ కమిషన్ సభ్యులను ప్రకటించడంతో, ఇక జీతాల పెంపు ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేంద్ర వేతన సంఘం చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా, ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా వ్యవహరిస్తారని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కమిషన్ సభ్యుల ప్రకటన రాగానే చాలామందిలో ఒక అనుమానం మొదలైంది. రాబోయే జనవరి 1 నుంచే పెరిగిన జీతాలు అందుతాయా? అని. దీనిపై ఉన్న ...