భారతదేశం, డిసెంబర్ 31 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఏడో వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగియనుండటంతో, 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే పెరిగిన జీతాలు చేతికి అందుతాయా? అంటే.. కొంత జాప్యం తప్పదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా వేతన సంఘం సిఫార్సులను ప్రతి పదేళ్లకు ఒకసారి అమలు చేస్తారు. ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం నిబంధనలు 2026 జనవరి 1 నుంచి వర్తిస్తాయి. అయితే, తుది నివేదిక సమర్పించడానికి, ప్రభుత్వం దానిని ఆమోదించడానికి సమయం పడుతుంది.

"8వ వేతన సంఘం తన నివేదిక సమర్పించడానికి సాధారణంగా 18 నెలల సమయం ఇస్తారు. అంటే, కొత్త శాలరీ స్లాబులపై అధికారిక ప్రకటన ...