భారతదేశం, ఏప్రిల్ 17 -- 7th Pay Commission HRA: ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (DA hike)ను ప్రభుత్వం 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చితి, గందరగోళం నెలకొంది. సాధారణంగా, డీఏ (DA hike) పెంపుతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కూడా పెరుగుతుంది.

అయితే 7వ వేతన సంఘం హెచ్ఆర్ఏ (HRA) సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులను కానీ, నోటిఫికేషన్ ను కానీ జారీ చేయలేదు. అయితే, అందుకు ప్రత్యేక నోటిఫికేషన్ అవసరమా? డీఏ (DA hike) తో పాటు ఆటోమేటిక్ గానే హెచ్ ఆర్ ఏ (HRA) పెంపు జరుగుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక 7వ వేతన సంఘం (7th Pay Commission) హెచ్ఆర్ఏ నోటిఫికేషన్ కు సంబంధించి,...