భారతదేశం, మార్చి 17 -- అసలైన ఫైనల్ పోరు ఇలా ఉండాలి. పాయింట్ కోసం ప్రాణం పెట్టడమంటే ఇదే. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్, వాంగ్ జీ యీ ఫైటింగ్ చరిత్రలో నిలిచిపోయేదే. ముఖ్యంగా ఓ పాయింట్ కోసం ఈ ఇద్దరు 79 షాట్ల ర్యాలీ ఆడారు. ఇంతటి సుదీర్ఘమై ర్యాలీ ఆడిన వీళ్ల స్టామినా అదుర్స్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ఫ్యాన్స్ కు కట్టిపాడేసింది. సౌత్ కొరియాకు చెందిన ఆన్ సె యంగ్.. చైనా ప్లేయర్ వాంగ్ జీ మధ్య ఫైట్ హోరాహోరీగా సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ 1,2 ర్యాంకుల్లో ఉన్న ఈ ప్లేయర్స్ మధ్య పోరాటం మరో రేంజ్ లో సాగింది.

తొలి గేమ్ ను ఆన్ సె యంగ్ 13-21తో ఓడిపోయింది. రెండే గేమ్ లో 6-6తో స్కోరు ఈక్వెల్ అయింది. ఆ తర్వాతి పాయిం...