Hyderabad,telangana, ఆగస్టు 27 -- భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఈ ఏడాది 69 అడుగులు, 28 వెడల్పుతో కొలువుదీరాడు. 84 రోజుల పాటు శ్రమించి ఈ భారీ గణనాథుడిని నిర్మించారు. ఇవాళ తొలి పూజను రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభం కానుంది.
9 రోజుల పాటు భక్తుల నుంచి ఖైరతాబాద్ మహాగణనాథుడు పూజలను అందుకోనున్నాడు. భక్తులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పార్కింగ్ విషయంలో కూడా సూచనలు చేశారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.