భారతదేశం, డిసెంబర్ 14 -- రియల్​మీ సంస్థ తన రియల్​మీ నార్జో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఎక్స్​ప్యాండ్​ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ వారం రియల్​మీ నార్జో 90 5జీ, రియల్​మీ నార్జో 90ఎక్స్​ 5జీ అనే రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే కొన్ని ఫీచర్లను టీజ్ చేసినప్పటికీ, అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు లీకయ్యాయి. వాటి వివరాలు..

ఈ రియల్​మీ నార్జో 90 స్మార్ట్​ఫోన్​ సిరీస్‌ను భారత్‌లో డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయిన వెంటనే అమెజాన్, రియల్​మీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

టిప్‌స్టర్ పారస్ గుగ్లానీ లీక్ చేసిన వివరాల ప్రకారం ఈ సిరీస్ ధరలు..

రియల్​మీ నార్జో 90: ఆఫర్‌లతో కలిపి సుమారు రూ. ...