భారతదేశం, అక్టోబర్ 26 -- చైనాలో విడుదలైన కొద్ది రోజులకే తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15ను భారత్‌లో లాంచ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే అమెజాన్​లో ప్రత్యక్షమైంది. దీని బట్టి ఈ ఫోన్​ని వచ్చే నెలలోనే దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. భారతీయ వేరియంట్ అధికారిక విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఐక్యూ 13తో పోలిస్తే ఇందులో అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఐక్యూ 15లో కనిపించబోయే ప్రధానమైన టాప్ 5 మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

1. డిస్‌ప్లే అప్​గ్రేడ్స్​

ఐక్యూ 15 స్మార్ట్​ఫోన్​లో కొద్దిగా పెద్దదైన 6.85-ఇంచ్​ కర్వ్డ్ శాంసంగ్ ఎం14 ఎల్​టీపీఓ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఇది ఐక్యూ 13లో ఉన్న కర్వ్డ్ క్యూ10 ఎల్​టీపీఓ అమోఎల్​...