భారతదేశం, అక్టోబర్ 31 -- లావా మొబైల్స్ సంస్థ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కంపెనీ తమ సోషల్ మీడియా ఖాతాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను పోస్ట్ చేసింది. దీన్ని బట్టి, త్వరలోనే లావా అగ్ని 4ను లాంచ్​ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

లావా బ్రాండ్ ఈ కొత్త స్మార్ట్​ఫోన్​​ పేరును లేదా పూర్తి స్పెసిఫికేషన్‌లను ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. అనేక టీజర్‌లు, ఆన్‌లైన్ నివేదికలు రాబోయే మోడల్ లావా అగ్ని 4 అని సూచిస్తున్నాయి.

కంపెనీ తమ ఎక్స్​ (గతంలో ట్విట్టర్) ఖాతాలో "త్వరలో వస్తోంది" అనే సందేశంతో పాటు నాలుగు ఫైర్​ ఎమోజీలను పోస్ట్ చేసింది. "అగ్ని" అంటే ఇంగ్లీషులో "ఫైర్" అని అర్థం కాబట్టి, వినియోగదారులు ఆ నాలుగు ఎమోజీలను లావా అగ్ని 4తో ముడిపెట్టారు.

ఆ వెంటనే,...