Hyderabad, జూలై 18 -- సినిమాల్లో స్టంట్ మాస్టర్ల ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్న కాస్తా రిస్కీతో కూడుకున్నది. ఆడియెన్స్‌కు మంచి థ్రిల్ ఇచ్చేందుకు వివిధ రకాలుగా యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తుంటారు. తెర ముందు హీరోలు అదిరిపోయే ఫైట్ సీన్స్ చేస్తున్నారంటే దానికి కారణం తెర వెనుక ఉన్న స్టంట్ మాస్టర్లదే.

అలాంటి స్టంట్ మాస్టర్ల పట్ల బాలీవుడ్ స్టార్ హీరో, కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేసిన అక్షయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు. సినిమాల్లో రియల్‌గా స్టంట్స్ చేసి యాక్షన్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్ స్టంట్ మెన్, ఉమెన్స్ పట్ల మంచి నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది.

ఏకంగా 650 మంది స్టంట్ వర్కర్లకు ప్రమాద బీమాను చేయించాడు అక్షయ్ కుమార్. సుమారు 650 నుంచి 700 మంది స్టంట్ మాస్టర్స్‌కు వ్యక్తిగత ఇన్సురెన్స్ సదుపాయం కల్పించారు అక్షయ్ కుమార్. ఈ బీమా తీ...