భారతదేశం, జూన్ 12 -- ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి మనందరికీ తెలుసు. ఆయన ట్వీట్లు ఎంత వైరల్ అవుతాయో, ఆయన చురుకుదనం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. 70 ఏళ్లకు చేరువలో ఉన్నా, ఆనంద్ మహీంద్రా చాలా ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఇంత వయసులో కూడా ఆయన ఎలా ఇంత ఫిట్‌గా ఉంటున్నారు? ఆయన ఫిట్‌నెస్ రొటీన్ ఎలా ఇక్కడ చూడండి.

నిజానికి, ఆనంద్ మహీంద్రా తమ డైట్, వర్కవుట్ రొటీన్‌లను బయటపెట్టలేదు. కానీ, ఫిట్‌నెస్, వెల్‌నెస్ గురించి వారు తరచుగా ట్వీట్ చేస్తుంటారు. గతంలో ఒక ఎక్స్ (X) యూజర్ "మీరు మీ ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తారు? మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా?" అని అడిగినప్పుడు, ఆనంద్ మహీంద్రా తమ వర్కవుట్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అది చూస్తే, వారి ఫిట్‌నెస్ దినచర్య చాలా సమతుల్యంగా, పక్కా ప్లానింగ్‌తో ఉన...