భారతదేశం, ఆగస్టు 13 -- ఒప్పో ఇటీవల తన గేమింగ్ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ కే13 టర్బో ప్రోని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అదే సమయంలో పోకో కూడా ఇటీవల తన ఎఫ్7తో గేమర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ రెండు ఫోన్‌లు రూ. 40,000 ధరలోపు మంచి ఆప్షన్‌లుగా నిలుస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఛాయస్ అనేది తెలుసుకోవడానికి వాటి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ చూద్దాము..

ఒప్పో కే13 టర్బో ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.8-ఇంచ్​ ఎల్​టీపీఎస్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

మరోవైపు పోకో ఎఫ్7లో 6.83-ఇంచ్​ 1.5కే ఓఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంది. దీనికి 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హై బ్రైట్‌నెస్ మోడ్​లో 1,700 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అంతేకాకుండా దీనికి కార...