భారతదేశం, ఆగస్టు 4 -- భారత మార్కెట్లో వివో తన సరికొత్త అఫార్డిబుల్​ 5జీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దాని పేరు వివో టీ4ఆర్. స్లిమ్, తేలికపాటి డిజైన్, మీడియాటెక్​ డైమెన్సిటీ 7400 5జీ ప్రాసెసర్, 5700ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇదే ధరల విభాగంలో మోటో జీ86 పవర్​ 5జీ అనే మరో స్మార్ట్​ఫోన్​ కూడా ఉంది. ఇది కొత్త వివో టీ4ఆర్​కు గట్టి పోటీనిస్తోంది. కాబట్టి, మీరు ఈ బడ్జెట్‌లో ఒక స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ రెండు మిడ్-రేంజ్ ఫోన్‌ల మధ్య వివరణాత్మక పోలికను మేము ఇక్కడ అందిస్తున్నాము చూసేయండి.

వివో టీ4ఆర్​ డిజైన్ వివో వీ50 సిరీస్‌ను పోలి ఉంటుంది. దీనికి టెక్స్‌చర్డ్ రేర్​ ప్యానెల్, పిల్-షేప్డ్ కెమెరా బార్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 7.39 ఎంఎం మందంతో 183.5 గ్రాము...