భారతదేశం, జూలై 31 -- మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ లేటెస్ట్​గా భారత మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. దాని పేరు మోటో జీ86 పవర్​ 5జీ. ఈ గ్యాడ్జెట్​ అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్​తో రావడంతో.. రూ.20వేల ధరలోపు సెగ్మెంట్​లో ఇది మంచి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో 6,720ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్​ వంటివి హైలైట్​. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

కెమెరా: ఈ మోటో జీ86 పవర్​ స్మార్ట్​ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ LYTIA-600 సెన్సార్ ప్రధాన కెమెరాగా పనిచేస్తుంది. దీనికి అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 3-ఇన్-1 ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

డ్యూరెబులిటీ: ఈ స్మార్ట్​ఫోన...