భారతదేశం, సెప్టెంబర్ 2 -- హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్​ ఎక్స్​7డీ 5జీని మలేషియాలో లాంచ్​ చేసింది. హానర్ ఎక్స్ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. 6500ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​పై అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హానర్ ఎక్స్​7డీ 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.77 ఇంచ్​ హెచ్​డీ+ (720x1,610 పిక్సెల్స్) టీఎఫ్​టీ ఎల్​సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌ను, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్, అడ్రినో ఏ619 జీపీయూ ఉన్నాయి. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4G వేరియంట్ మాత్రం స్నాప్‌...