భారతదేశం, అక్టోబర్ 5 -- వివో సంస్థ ఈ నెలలో భారత్‌లో కొత్త వీ సిరీస్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆ మోడలే వివో వీ60ఈ 5జీ. అధికారిక విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, కెమెరా ఫీచర్లు, ఇతర అంశాలను టీజర్‌ల రూపంలో విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. అధికారిక టీజర్లతో పాటు.. వివో వీ60ఈ 5Gకి సంబంధించిన అనేక లీక్‌లు కూడా ఇంటర్నెట్‌లో విస్తృతంగా వస్తున్నాయి. దీని వల్ల ఈ కొత్త ఫోన్ గురించి ముందే ఒక అంచనాకు వచ్చే అవకాశం దొరుకుతోంది.

ఈ నేపథ్యంలో.. ఈ కొత్త స్మార్ట్​ఫోన్ పాత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసుకోవడం ఎంతవరకు ప్రయోజనకరం అని తెలుసుకోవడానికి, వివో వీ60ఈ 5Gని దాని మునుపటి మోడల్ అయిన వివో వీ50ఈ 5జీతో పోల్చి, ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త వివో వీ60ఈ 5జీ డిజైన్...