భారతదేశం, జూన్ 18 -- ఇన్ఫినిక్స్ తన నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్ ఫోన్ లైనప్ ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో భారత్ లో విస్తరించింది. ఇప్పటికే ఈ మోడల్ లో 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ల వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో నోట్ 50ఎస్ 5జీ+ స్మార్ట్ ఫోన్ ని ఇన్ఫినిక్స్ భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

మరి ఈ కొత్త మోడల్ ఎంత ధరకు అందుబాటులో ఉంది, దాని లభ్యత ఏంటో ఓ లుక్కేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ ప్లస్ కొత్త 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇది జూన్ 23 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా లభ్యం కానుంది. వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ఎంపికలను అందించాలన్న లక్ష్యంతో ఈ వేరియంట్ ను తీసుకువచ్చామని ఇన్ఫినిక్స్ తెలిపింది.

ఇన్ఫినిక్స్ నోట్ ...