భారతదేశం, జూన్ 12 -- ఎయిరిండియా విమానం ఏఐ171 టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత చివరి సిగ్నల్ వచ్చిందని, అది కూలిపోయే ముందు 625 అడుగుల ఎత్తుకు చేరుకుందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ వెల్లడించింది.

ప్రమాదం జరిగిన కొన్ని సెకన్ల తర్వాత అహ్మదాబాద్ ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. "ఫ్లైట్ #AI171 నుండి ప్రారంభ ఎడిఎస్-బి డేటా ప్రకారం విమానం గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు (విమానాశ్రయం ఎత్తు సుమారు 200 అడుగులు) చేరుకుంది. తరువాత అది నిమిషానికి -475 అడుగుల వేగంతో నిట్టనిలువుగా కిందకు దూసుకురావడం ప్రారంభించింది" అని ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు మధ్యాహ్నం 1.38 గంటలకు చివరి సిగ్నల్ వచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఫ్లైట్ రాడార్ తెలిపింది.

ప్రమాదానికి గురైన విమానంలో 52 మం...