భారతదేశం, ఆగస్టు 2 -- రియల్‌మీ నోట్ 70టీ స్మార్ట్‌ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్. యునిసోక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. పెద్ద బ్యాటరీతో స్ట్రాంగ్ బాడీని పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధర ఎంత? అందులో ప్రత్యేకతలు ఏంటి? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం

గిజ్మోచైనా నివేదిక ప్రకారం, రియల్‌మీ నోట్ 70టీలో 6.74 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడీ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది 720x1600 పిక్సెల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ను సపోర్ట్ చేస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 563 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. యూనిసోక్ టీ7250 చిప్‌సెట్, 15వాట్ ఛార్జింగ్‌తో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.

4 జీబీ ర్యామ్, 12 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 64 జీబీ/128 జీబీ/256 జీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ...