భారతదేశం, డిసెంబర్ 16 -- అపర కుబేరుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును నెలకొల్పారు! 600 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 49.8 లక్షల కోట్లు) సంపదను దాటిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి పెరిగింది.

ఈ ఏడాది అక్టోబర్​లోనే మస్క్​ సంపద తొలిసారి 500 బిలియన్​ డాలర్ల మార్క్​ను తాకింది. కేవలం రెండు నెలల వ్యవధిలో మరో 100 బిలియన్​ డాలర్లు ఆయన నెట్​ వర్త్​ ఖాతాలో చేరాయి. ప్రపంచంలో మొదటి, రెండొవ అత్యంత ధనవంతుల మధ్య ఇప్పుడు దాదాపు 400 బిలియన్​ డాలర్ల వ్యత్యాసం ఉంది!

స్పేస్‌ఎక్స్ బలం: వచ్చే ఏడాది స్పేస్‌ఎక్స్ పబ్లిక్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని రాయిటర్...