భారతదేశం, అక్టోబర్ 12 -- కాంతార చాప్టర్ 1 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయినా ఈ చిత్రానికి లాభాలు రావాలంటే ఎంత రాబట్టాలి? బ్రేక్ ఈవెన్ కు ఎన్ని కోట్ల రూపాయాలు రావాలో? ఇక్కడ చూసేయండి.

ఈ ఏడాది 'కాంతార చాప్టర్ 1' ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'ఛావా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ ఏడాది భారతీయ చిత్రాలకు మంచి ఆరంభం లభించింది. కానీ ఆ తర్వాత 'సైయారా', 'మహావతార్ నరసింహ', 'లోకః చాప్టర్ 1: చంద్ర', 'L2: ఎంపురాన్' మాత్రమే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించగలిగాయి. అయితే ఈ చిత్రాలలో ఏదీ కూడా అందని ద్రాక్షగా ఉన్న రూ. 1000 కోట్ల మార్కును దాటలేదు. ఈ ఏడాది ఆ మార్కును అందుకునే చిత్రంగా రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' నిలుస్తుందని భావిస్తున్...