భారతదేశం, డిసెంబర్ 23 -- బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్' వసూళ్ల వర్షం కురిపిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా పలు భారీ రికార్డులను తుడిచిపెట్టేసింది.

తాజాగా దురంధర్ చిత్రం 2025 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా అగ్రస్థానానికి చేరుకుంది. మూడవ సోమవారం (డిసెంబర్ 22) ఈ సినిమా వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఓవరాల్‌గా మాత్రం తన దూకుడును అస్సలు తగ్గించడం లేదు.

ఇప్పటివరకు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్న రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' (రూ. 852 కోట్లు), విక్కీ కౌశల్-రష్మిక మందన్నాల 'ఛావా' (రూ. 807 కోట్లు) రికార్డులను 'ధురంధర్' అధిగమించింది. 18 రోజులు ముగి...