భారతదేశం, మార్చి 3 -- వినియోగదారులు కారు కొనుగోలు చేసేటప్పుడు భద్రత ఒక ముఖ్యమైన అంశంగా చూస్తారు. ఎందుకంటే ఎంత డబ్బులు పెట్టినా.. సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా తమ చౌకైన కార్లకు ఆధునిక భద్రతా ఫీచర్లను అందిస్తున్నాయి. అలా 6 ఎయిర్ బ్యాగ్స్‌తో ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం..

మారుతి సుజుకి ఆల్టో కె10 ఇప్పుడు దేశంలో అత్యంత సరసమైన స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ కారుగా మారింది. మారుతి ఆల్టో కె 10 ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ.4.23 లక్షలు(ఎక్స్ షోరూమ్), టాప్ మోడల్‌లో రూ .6.21 లక్షల వరకు ఉంది. కారులో 6-ఎయిర్ బ్యాగుల భద్రతతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను కూడా అందించారు.

మీరు 6 ఎయిర్ బ్యాగుల కారు కోసం చూస్తుంటే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా బెటర్ ఆప్షన్. ఇండియ...