భారతదేశం, నవంబర్ 24 -- ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయం అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశ మహిళల క్రికెట్​ చరిత్రలో ఇదొక నూతన శకం అని అందరు అభివర్ణిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ తనకు తాను ఒక స్పోర్ట్స్​ కారును బహుమతిగా ఇచ్చుకున్నారు. అదే ఎంజీ సైబర్​స్టర్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 75లక్షలు

షఫాలీ వర్మ తన ఎంజీ సైబర్‌స్టర్‌తో ఉన్న ఫొటోలను ఇటీవలే షేర్​ చేసింది ఎంజీ ఇండియా. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును రెడ్ కార్పెట్‌పై పార్క్ చేసి ఉన్న క్రికెట్ మైదానంలో ఆమె కనిపించారు. ఈ ప్రత్యేక డెలివరీ సందర్భంగా, షఫాలీ తన కారు రంగుకు సరిపోయే దుస్తులను ధరించి, ఈ ఈవెంట్‌కు ప్రత్యేక శైలిని జోడించారు.

కారు డెలివరీకి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో పో...