భారతదేశం, జూలై 17 -- నటుడు ఆర్. మాధవన్ 55 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ చాలా యంగ్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఇందుకోసం ఆయన ఎలాంటి చికిత్సలు తీసుకోలేదట. వేయించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, అలాగే కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, ఎండ, శాకాహార భోజనం మాత్రమే తన అందం వెనుక ఉన్న రహస్యమని చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన చర్మం అంటే కేవలం చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటమే కాదు.. లైఫ్‌స్టైల్ కూడా కీలకమని మాధవన్ అంటున్నారు. ముడతలు, చర్మ సమస్యలు రాకుండా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ముఖ్యమే అయినా, ఎండను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. జూలై 7న జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన చర్మ సంరక్షణ అలవాట్ల గురించి మాట్లాడారు. జూన్ 1న మాధవన్ 55వ ఏట అడుగుపెట్టారు.

మితంగా ఎండ తగలడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ డి...