భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ఇటీవల రూ. 69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) విలువ చేసే ఎంజీ ఎం9 లగ్జరీ ఎంపీవీని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తన గ్యారేజీలో కొత్తగా చేరిన ఈ కారుతో (మెటల్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ షేడ్‌లో) ఫొటోకు ఫోజులిచ్చారు మహదేవన్​.

భారతదేశంలో, ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీ కేవలం 'ప్రెసిడెన్షియల్ లిమో' ట్రిమ్‌లో మాత్రమే, మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీనిని జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ అయిన 'ఎంజీ సెలెక్ట్' ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఇది దేశంలో ఎంజీ సంస్థ అందిస్తున్న ఐదో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025'లో ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఎలక్ట్రి...